సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాము అభిమానించే సినిమా స్టార్ లకు కష్టం వస్తే వారి అభిమానులు ఎంతకైనా తెగిస్తారు. అటువంటిది లక్షలాది అభిమానులను కలిగి ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన అరెస్ట్ జరిగిన తీరుకు నిరసన తెలిపారు.. పోలీసులు వారిస్తున్నా సరే అర్ధరాత్రి నడి రోడ్డుపై పడుకొని నిరసన తెలియజేసి చంద్రబాబు స్వంత కుటుంబీకులు లోకేష్, బాలకృష్ణ వంటి వారు కూడా చెయ్యలేని సాహసం చేసి చంద్రబాబు ఫై తన అభిమానం చాటుకొన్నారు. వివరాలులోకి వెళ్ళితే జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ నిన్న అవినీతి కేసులలో అరెస్ట్ అయిన చంద్రబాబును చూడటం కోసం నిన్న సాయం త్రమే బేగం పేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానం లో గన్న వరం వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పవన్‌ కల్యాణ్ విజయవాడ వచ్చి.. ఏపీ ప్రజలను తెచ్చగొట్టడానికి వస్తున్నాడని కృష్ణా జిల్లా పోలీసులు ఎయిర్‌పోర్టు అధికారులకు మెయిల్‌ పంపారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు పవన్‌ విమానానికి అనుమతి నిరాకరించారు. అయితే రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయల్ధేరిన ఆయన్ను ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద గత రాత్రి పోలీసులు అడ్డుకున్నా రు. దీం తో పోలీసుల వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా కావాలా? అంటూ ప్రశ్నించారు. జనసైనికులు తరలి రావడంతో హైటెన్షన్‌ నెలకొంది. పవన్ కాసేపు కారుమీద కూర్చుని ధర్నాచేసారు. తరువాత నడిరోడ్డు మీద పడుకొని నిరసనలు చేస్తుండటంతో.. షాక్ తో విస్తుపోయిన పోలీసులు ఆయనను బ్రతిమిలాడి చివరిగా తమ కారు ఎక్కించుకొని దగ్గర ఉండి పవన్‌ను జనసేనపార్టీ కార్యాలయం వరకు వచ్చి వదిలేశారు. దేశంలో ఇతర రాజకీయ పార్టీ అధినేతలు అరెస్ట్ అయితే ఇతర పార్టీ నేతలు బాధిత నేతలను కల్సి సంఘిభావనలు తెలపడం చూసాం కానీ ఇదేమిటి ? మరో పార్టీ అధినేత వచ్చి రోడ్డుపై పడుకోవడం ఏమిటి? ఎక్కడ చూడని విచిత్ర పరిణామం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *