సిగ్మాతెలుగు డాట్, న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక 23 మంది మరణించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేటి మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రకటిస్తూ.. .మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలు భావోద్వేగాలకు గురికాకుండా ప్రజలు, టీడీపీ శ్రేణులు, అభిమానులు సంయమనం పాటించాలన్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో ధర్మమే గెలుస్తుందన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాక్షస ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పడం ఖాయమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *