సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నేడు, సోమవారం 23 మంది లబ్ధిదారులకు ఎల్.ఓ.సి మరియు ముఖ్యమంత్రి సహాయనిధి రూ 16,56,033 చెక్కులను అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ వైద్య చికిత్సలు, అత్యవసర శస్త్ర చికిత్సలకోసం పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీ మంజూరి పత్రాలు అందజేస్తూ ఆపత్కాలంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మెరగాని నారాయణమ్మ మండల మరియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ,మండల అధ్యక్ష కార్యదర్శులు .యూనిట్ క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు కో-కన్వీనర్లు గ్రామ వార్డు కమిటీల నాయకులు నియోజకవర్గం ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *