సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలలో ఉద్యోగాల ఎంపికలో స్కాం జరిగిందని దానిపై ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు నిర్వహించాలని , మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేపట్టాలని గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్న నిరసనలు ర్యాలీ లు చేపట్టిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం వైసీపీ శ్రేణులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో లో ర్యాలీ చేపట్టి డీఎస్సీ ఫై సిబిఐ దర్యాప్తు చేసి దోషులను బయటపెట్టాలని కోరుతూ నినాదాలు చేసారు. నేడు సోమవారం అమలాపురం లో వైసీపీ శ్రేణులు ఇదే అంశం ఫై భారీ ర్యాలీని నిర్వహించడం గమనార్హం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *