సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నచంద్రబాబు ను జైలు కు బదులుగా కోర్ట్ అనుమతితో గృహ నిర్బంధంలో ఉంచుదామని అది కాస్త గౌరవంగా ఉంటుందని భావించిన ఆయన కుటుంబ సబ్యులకు టీడీపీ క్యాడర్ కు ఏసీబీ కోర్ట్ లో నేడు , మంగళవారం నిరాశ ఎదురయ్యింది. దానికి తోడు ఆయనను తరుముకొస్తున్న మరిన్ని అవినీతి కేసులు .. ఎంపీ విజయసాయి రెడ్డి ఇక 10 ఏళ్ళు జైలులోనే చంద్రబాబు అన్న వ్యాఖ్యలు.. ఇంకా కేసులు వేస్తారు.. ఇది మనకు కష్టకాలం .. ఇక పార్టీ కి నేను ముందుండి నడిపిస్తా .. భయపడకండి అంటూ బాలకృష్ణ ఇచ్చిన భరోసా తో టీడీపీ క్యాడర్ లో పార్టీ భవిషత్తు ఫై మరిన్ని అనుమానాలు తలెత్తాయి. దానికి తోడు అందరు ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ఫై నేడు, మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ప్రకటించింది.. జైల్లో చంద్రబాబుకు ప్రాణ హాని ముప్పు ఉందని, అందువల్ల ఆయన్ను హౌస్ రిమాండ్ కు అనుమతించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్ట్ తిరస్కరించింది. ఒక వేళా ఇంటి వద్ద ఆయన ప్రాణాలకు హాని కలిగితే మీరు బాధ్యత వహిస్తారా?అని ప్రశ్నిస్తూ.. ఆయనకు జైలు వద్దే భద్రత ఎక్కువ అని భావిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. సీఎం జగన్ రేపు ఢిల్లీ పయనం.. చంద్రబాబుఫై కేంద్ర ITపరిధిలోని 118 కోట్ల స్కాం.. కీలకమైన కేసుకు సంబంధించి పట్టు బిగించేందుకు అని టీడీపీ లో కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ కేసు నిరూపితమైతే ఎన్నికలలో పోటీ చెయ్యడానికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *