సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లండన్ నుండి తిరిగి వచ్చిన సీఎం జగన్ ను తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నేడు, మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, టీటీడీ ఈవో, ఎ వి ధర్మారెడ్డి లు తిరుమల వేద పండితులవేదమంత్రాల అస్సిసులు తో శ్రీవారి శేష వస్త్రం, ప్రసాదం అందజేశారు. తదుపరి, సెప్టెంబరు 18వ తేదీ నుండి 26 వతేదీ వరకు కలియుగ వైకుంఠం తిరుమల లో జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
