సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా ప్రక్రుతి విలయాలతో విషాదాలు ఎక్కువ అవుతున్నాయి. మొన్న మొరాకోలో తీవ్ర భూకంపం లో 3వేలమంది పైగా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న పెను విషాదాన్ని మరువక ముందే తాజగా .. ఆఫ్రికా దేశమైన లిబియాలో పెనువిషాదం చోటు చేసుకుంది. లిబియాలో డానియల్ తూఫాను ప్రభావం తో డెర్నా నగరాన్ని వరదలు ముంచెత్తగా వరద ప్రవాహానికి సుమారు 2000 మంది చనిపోయి ఉంటారని ఐదారు వేల మంది గల్లంతయి ఉంటారని అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు
