సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో నేడు, బుధవారం పలుచోట్ల ప్రపంచం మెచ్చిన భారతీయ యుగపురుషుడు, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓవర్ బిడ్జ్ వద్ద వివేకానంద సెంటర్లోని వివేకానంద విగ్రహం వద్ద సామాజిక సమరసతా వేదిక, హిందూ చైతన్య వేదిక ,SC,ST హక్కుల సంక్షేమ వేదిక సంయుక్తంగా వివేకానంద జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. భారత దేశానికీ కావలసింది ఉక్కునరాలతో సంకల్పబలం ఉన్న యువత అని ఉద్భోధించిన మహనీయుడు వివేకానంద.. ముందుగా అయన విగ్రహానికి పూల దండలు వేశారు. ఈ సందర్భంగా మట్టపర్తి మురళీకృష్ణ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చేసిన గొప్ప కార్యాలను వివరించారు.SC,st హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికిముక్కు సుబ్బయ్య హిందూ చైతన్య వేదిక నాయకులు రావూరి అనంత్ ,మజ్జి మహేష్ ,గొంతెన శ్రీనివాస్,శ్రీకాంత్,నున్న అంజిబాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *