సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో జగన్ సర్కార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా సబ్ కలెక్టర్ శ్రీ సి. విష్ణు చరణ్ భీమవరం మండలం తాడేరు కోవిడ్ కేర్ సెంటర్ ను నేడు, బుధవారం సాయంత్రం అధికారులతో కలసి పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కనీసం 200 పడకలు ఏర్పాటు చేసేందుకు పాఠశాలలు తప్ప మిగిలిన ఏమైనా కళ్యాణ మండపాలు, మల్టీ స్టోర్ భవనాలు వంటివి గుర్తింస్తున్నామని.,కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిమాపక నివారణ భద్రత చర్యలు వుండేలా,ఎక్కువ సంఖ్యలో టాయిలెట్లు ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ కు అంబులెన్సు అందుబాటులో ఉంచాలని, మెడికల్ ఆఫీసర్ తో పాటు పారామెడికల్ సిబ్బంది, ప్రతి 30 పడకలకు మూడు షిఫ్టుల్లో ఇద్దరు నర్సులు ఒక సహాయకులు ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.ప్రతి 30 పడకలకు ఒక పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉంచాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ కు వచ్చే పేషెంట్లకు ఒక బకెట్ ,మగ్గు, సోపు ,టూత్ పేస్ట్ తదితర వస్తువులతో కూడిన కిట్ అందజేయాలన్నారు . కోవిడ్ కేర్ సెంటర్లో చేరిన పేషెంట్లు ఏడు రోజుల అనంతరం ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని స్పష్టమైతే వారిని డిశ్చార్జ్ చేయ్యాలన్నారు. ప్రత్యేకంగా 104 కాల్ సెంటర్ ను మరింత పటిష్టం చేయాలని,.ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేను పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ శ్రీ సి. విష్ణు చరణ్ ఆదేశించారు.సబ్ కలెక్టర్ వెంట తహశీల్దారు ఏ.వి. రమణా రావు,పురపాలక కమీషనరు శ్రీమతి యం.శ్యామల,నోడల్ అధికారి శ్రీనివాస రావు,డాక్టర్ సుగుణ రాజు , తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *