సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళఖాతంలో అల్పపీడం నేపథ్యంలో దక్షిణ కోస్తా ఆంధ్రాలో రేపటి శనివారం నుండి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగాల 24 గంటలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి , కృష్ణా, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. 50 కిమీ వేగంతో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి.కోస్తా ఆంధ్ర మీదుగా తెలంగాణ , మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈశాన్య -తూర్పు మధ్య బంగాఖాతం మీదుగా ఆవర్తనం ఏర్పడింది.దీని ప్రభావంతో ఈ నెల ఆఖరి వరకు వర్షాలు పడనున్నాయి..
