సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ఇక అన్నింటికీ ఆ సర్టిఫిర్టికెటే ఆధారం! బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు..”జనన మరణాల నమోదు (సవరణ) చట్టం -2023లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తోంది” అని కేంద్ర హోం శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 అమలులోకి వచ్చి న తేదీ లేదా ఆ తర్వాత జన్మించినవారు పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి చట్టం అనుమతిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్ , ఓటరు కార్డు, వివాహ నమోదు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా ల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వ యం ప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్ను సింగిల్ డాక్యుమెంట్ సమర్పించవచ్చు .
