సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పవిత్ర ముక్కోటి పర్వదినాన్ని నేడు, గురువారం ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అందరు అన్ని ప్రాంతాలలో జరుపుకొంటున్న నేపథ్యంలో నేడు, భీమవరం పట్టణంలో అన్ని వైష్ణవ దేవాలయాలు లో, శ్రీ మావుళ్ళమ్మవారు, షిర్డీ బాబా వార్ల ఆలయాలలో భక్తులు మాస్క్లు లు ధరించి తెల్లవారు జామునుండి పోటెత్తారు. ముక్కోటి రోజు అలవైకుంఠంలో శ్రీ లక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుండి దర్శనమిస్తారని పురాణ కధనాలు నేపథ్యంలో నేడు అన్ని వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం నుండి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చెయ్యడంతో భారీ క్యూ లైన్లలో నిలబడి భక్తులు దర్శనాలు చేసుకొన్నారు. పట్టణంలో ముఖ్యంగా జేపీ రోడ్డులోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో, కేశవరావు హైసూల్ వద్ద సురినీడి వారి వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం ( ఫై చిత్రం అక్కడే..) గునుపూడి పంచరమాం లో శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో, సమీపంలోని కాళ్ళకూరు లోని స్వయం భువుడు శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద భక్తులు వేల సంఖ్యలో శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు అందుకొంటున్నారు. పెదమిరం శ్రీ స్వర్ణ సాయి బాబా వారి గుడిలోనూ, సిసిలీ లోని శ్రీ షిర్ది సాయి బాబా గుడిలోనూ వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. పంచభక్ష్య పరమణాలతో భారీ అన్నసమారాధనలు కూడా జరిగాయి. సంక్రాంతి అతిదులకు ఈ ముక్కోటి అదనపు బోనస్ గా అనుభూతులను పంచింద
