సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పోడియం చుట్టుముట్టి కాగితాలు విసిరి తనను అవమాన పరిచిన 15 మంది టీడీపీ సభ్యులకు సభ నుండి సస్పెన్షన్ విధించినట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఈవిడుత అసెంబ్లీ సమావేశంలు లో తొలిరోజే ఏకంగా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కావడం గమనార్హం. . అయితే ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రం అసెంబ్లీ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, శ్రీధర్ రెడ్డిలను ఈ సెషన్ ఆఖరి వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సభ స్ధానాన్ని అగౌరవ పరిచారని అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ కారణంగా పేర్కొన్నారు. తన పోడియం మీద నిలుచుని తొడలు చరచి మీసాలు మెలివేసిన బాలకృష్ణ వికృత చేష్టలను మొదటి తప్పుగా క్షమిస్తున్నానని హెచ్చరించారు.
