సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్:. నేడు, గురువారం తాడేపల్లి లో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్‌తో భేటీ అయినా చిరంజీవి.. అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను సీఎంకు వివరించానని చెప్పారు.సినిమా టికెట్‌ ధరల విషయంపై కొలిక్కిరాని ఈ సమస్య జఠిలమవుతున్న నేపథ్యంలో సీఎంగారు ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు ఒక కోణంలో వినడం కాదు.. రెండో కోణంలోనూ వినాలని ఆయన అన్నారు.ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు సీఎంకు వివరించాను వివరించా. నేను చెప్పిన అన్ని విషయాలను సీఎం సానుకూలంగా ఆలకించారు. సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ స్పందన సంతృప్తినిచ్చింది. పైకి కన్పించినంత గ్లామర్ గా సినీ ఫీల్డ్ ఉండదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. ధియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. హాళ్లని మూసేస్తేనే బెటర్ అనే భావనకు కొందరు ధియేటర్ యజమానులు ఉన్నారు. అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను సీఎం పునః పరిశీలిస్తామన్నారు. ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశం వివరాలను సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు కూడా తెలియజేస్తాను. ఆ తర్వాత మరోసారి సీఎం జగన్ తో భేటీ అవుతా. వచ్చే సమావేశానికి అందర్నీ పిలిస్తే అందరం వస్తాం.అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా’అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *