సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తాడేపల్లి లోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సాంప్రదాయ సంక్రాంతి వేడుకలు నేడు, శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బోగి మంట వేసి బసవన్న కు కుంకుమ దిద్ది, సీఎం వైఎస్ జగన్ దంపతులు పట్టే నవ్వారు మంచంపై ఆహ్లదంగా కూర్చుని చిన్నారుల ప్రదర్శనలను ఆట పాటలను తిలకించారు. సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి తీరు నామం ధరించి వేడుకలకు సీఎం హాజరయ్యారు. వేడుకల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులతో సీఎం జగన్ సరదాగా కాసేపు ముచ్చటించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు.
