సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంబమయ్యాయి. ఈ నేపథ్యంలో భీమవరం నియోజకవర్గ పరిధిలోసంక్రాంతి ముగ్గులు తో తెల్లవారు జామునుండి వాడవాడలా భారీ భోగిమంటలు కోలాహలాలు, మొదలయ్యాయి. వెంప , పెద్దమిరం, చినమీరం వీరవాసరం, మన్మదుర్రు, కొవ్వాడ అన్నవరం ప్రాంతాలలో అయితే భోగిమంటలు వేడుకలు భారీ ఎత్తున నిర్వహించారు. గ్రామీణ సంక్రాంతిని ప్రతిబింబించే విధంగా సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. భోగి మంటలు వేసి, కోలాటంతో, ఆటపాటలతో, గంగిరెద్దుల నృత్యాలతో సందడి చేశారు. ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చిన అతిధులకు సంక్రాంతి మజా కాస్మో లుక్ ఉండే భీమవరంలో ఇంకా తమ మూలాలు మరువని గ్రామీణ వాతావరణం సంప్రదాయాలు ఎంత సజీవంగా ఉన్నాయో తెలియపరిచింది. ఇక పంచారామ క్షేత్రం, శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయాలు తో పాటు అన్ని దేవాలయాలు పుష్ప అలంకరణలు, భక్తుల భారీ క్యూ లైన్ లలో మాస్క్ లు ధరించి భారీ సందోహాలతో, బంధుమితృలతో ఆధ్యాత్మిక సందడి చేసాయి. పలు సంస్థలు ముగ్గులపోటీలు ఏర్పాటు చేసాయి. ఇక సాంప్రదాయ కోడి పందాలు భీమవరం శివారులో భారీ బారులు సందడి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తరలి వచ్చారు. వరుసగా 3 రోజులు పాటు స్థానికులతో పాటు దూరప్రాంతాల అతిధులకు సంక్రాంతి జోష్ పెంచనున్నాయి. జూదాలు జోలికి వెళితే మాత్రం అదో వ్యసనమే అని చెప్పాలి. ఇక శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు లైటింగ్, భారీ సెట్టింగ్స్, స్థానిక లూథరన్ హైస్కూల్ లో ఎస్ ఎస్ ట్రిడ్ ఫెయిర్ భారీ ఎగ్జిబిషన్, స్థానిక పద్మాలయ థియేటర్స్ ఎదురుగ రాయల్ క్రాఫ్ట్ వారి చేతి కళాకారుల భారీ ఎగ్జిబిషన్ సంక్రాంతి వినోదం, ఆహ్లదం కావలసినవారికి కావలసినంత అందించనున్నాయి.
