సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న అఖండతో బాలయ్య తో 3 బంపర్ హ్యాట్రిక్ హిట్స్ పూర్తీ చేసిన బోయపాటి శ్రీను యువహీరో రామ్ పోతినేని తో శ్రీ లీల హీరోయిన్ గా తీసిన స్కంద సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలతో వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంది? ఇక స్కంద’ కథ విషయానికి వస్తే.. ఏపీ సీఎం రాయుడు (అజయ్ పుర్కార్) కుమార్తెను తెలంగాణ సీఎం రంజిత్ రెడ్డి(శరత్ లోహితాస్వా ) కొడుకు పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో ఎత్తుకొనిపోతాడు. పరువు పోయిందని భావించిన ఏపీ సీఎం ఎలా అయినా తెలంగాణ సీఎం కుమారుడిని అంతం చేయాలని ప్లాన్ చేయగా దాన్ని భాస్కర్( రామ్) అడ్డుకుంటాడు. మరోసారి భాస్కర్ తెలుగు రాష్ట్రాల సీఎం ల ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్ చేసి తన ఊరైన రుద్రరాజపురం తీసుకువెళతాడు. రుద్రగంటి రామకృష్ణరాజు (శ్రీకాంత్) మీ వల్లే జైలు శిక్ష అనుభవిస్తున్నాడని అతన్ని నిర్దోషి గా బయటకి తీసుకొస్తేనే మీ కూతుళ్లను అప్ప జెబుతానని అంటాడు. వీరిందరి మధ్య లింక్ ఏంటి ?మరి తమ కూతుర్లను విడిపిం చుకునేందుకు ఇద్దరు ముఖ్య మంత్రులు ఏం చేశారు? అనేదే వెండి తెరపై చూడవలసిందే.. ఇక సినిమా ఎలాగుందంటే ఒక్క మాటలో.. ప్రేక్షకుడు పూర్తీ రియాలిటీ మర్చిపోతే సినిమా బాగుంటుంది. అంతే .. బోయపాటి కథనం విషయం లోనే మరింత జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది అనిపిస్తుంది. డ్యూయల్ రోల్ లో హీరో రామ్ లోని మాస్ యాంగిల్ ని ONE MAN SHOWఎలివేట్ చేసే డైలాగ్స్, రియాలిటీకి దగ్గరగా లేకపోయినా యాక్షన్ సీక్వె న్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నా యి. ఇక మిగతా నటీనటులు ఎంతకు అంతే .. నేటి రాజకీయాలపై సెటైర్లు,, చాలా డైలాగులు వేసాడు బోయపాటి శ్రీను.. రామ్ తల్లి పాత్రలో గౌతమి, మెరిసింది. ఇక సినిమా మొత్తం మీద సినిమాటోగ్రఫీ సినిమాని ఎలివేట్ చేసింది తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ బాగుంది. కానీ పాటలు మాత్రం అంత క్యాచి అనిపించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *