సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సంక్రాంతి రోజునాడు.. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో విషాదం చోటు చేసుకోండి. స్థానిక ఎన్ఐటి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణపురం నుంచి దువ్వాడ వెళుతున్న చేపల లారీ బోల్తాకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో లారీలో పది మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన కూలీలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద తీరు ఫై దర్యాప్తు ప్రారంభించారు.
