సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో ప్రతి ఏడాది పట్టణ నడిబొడ్డున ఉండే సంక్రాంతి పండుగకు స్థానికులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రముఖుల రాకపోకలతో ఎంతో కోలాహలంగా ఉండే గ్రంధి వారి నివాసం పెద్దాయన గ్రంధి వెంకటేశ్వర రావు మరణంతో నేడు, శుక్రవారం బోసిపోయింది.ప్రతి ఏడాది, బోగి పండుగ రోజు ఇంటి ఎదురుగ తెల్లవారు జామున వేసే బోగి మంట వేడుకలలో పెద్దాయన గ్రంధి వేంకటేశ్వర రావు తప్పనిసరిగా వచ్చి పాల్గొనేవారు.అయితే ఈసారి పెద్దాయన గ్రంధి వెంకటేశ్వర రావు మరణం తో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ రోజు అనగా 14 వ తేదీ నుండి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆయన కుమారులు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు వారి సోదరులు పితృ కర్మల ఆచరించాడనికి అలహాబాద్ లోని వారణాసి(కాశీ) కు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండరు గమనించగలరు. up file photo
