సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లో నేడు, మంగళవారం ప్రధాని మోడీ నిజామాబాద్ జిల్లాలో బహిరంగ సభలో సీఎం కెసిఆర్ ఫై గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయి విమర్శలు, ఆరోపణలు చేసారు. ఆయన ప్రసంగంలో.. సీఎం కెసిఆర్ గతంలో ఎన్డీఏలో చేరతానని వెంటపడ్డారు.. కానీ ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ‘‘GHMC ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి కలిశారు. తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని కేసీఆర్‌ చెప్పారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్‌ కోరారు. ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యమని కేసీఆర్‌తో చెప్పా. మీరేమైనా రాజులా? అని నేను ప్రశ్నించా. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పా. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్‌కు తేల్చి చెప్పా. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్ భయపడుతున్నాడు’’ అని మోదీ హెచ్చరించారు.. తెలంగాణ అభివృద్ధి కి ఎన్నో నిధులు ఇచ్చాము. గతంలో తనకు కెసిఆర్ ఆర్భాటంగా స్వాగతం పలికేవాడని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఇప్పుడేమైంది? మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయింది. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదు. ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడింది. కేసీఆర్‌, ఆయన కుమారుడు… ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్ఎస్ దోచుకుంటోంది. కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దు. బీజేపీకి అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ దో చుకున్నదంతా కక్కిస్తా’’ అని మోదీ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *