సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు లో నేపథ్యంలో నేడు, గురువారం విచారణ జరుపుతున్న విజయవాడ ఏసీబీ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న ఆయన రిమాండ్ ను ఈ నెల 19 వరకు పొడిగించింది. దీనితో టీడీపీ శ్రేణులు మరింత డీలా పడిపోయాయి. నేడు ఏసీబీ కోర్ట్ లో చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే.. సిఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి హోరాహారిగా వాదనలలో పోటీ పడ్డారు. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన ప్రతిష్ఠమైన వాదనతో పాటు నాలుగు అడుగులు ముందుకు వేసి అనేక ఆధారాలు కోర్టుకు సమర్పించడం తో చంద్రబాబు కు మరింత కాలం జైలు రిమాండ్ తప్పలేదు.. స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లిన నిధులకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను కోర్టుకు సమర్పించడంతో పాటు .. టీడీపీ బ్యాంక్ ఖాతాలకు రూ.27 కోట్లు మళ్లించాయని ఆధారాలు చూపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన సంభాషణలను కూడా న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *