సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా..ఆగస్టు 15 భారత స్వతంత్ర దినోత్సవం వారోత్సవాలలో భాగంగా నేడు, సోమవారంకేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో , రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మరియు ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాల్గొనగా భారీ బైకు ర్యాలీ జరిగింది. భీమవరం 3 టౌన్ లోని జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమై, పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ASR నగర్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు మువ్వన్నెల జాతీయ పతకాలు చేతబూని యువత ఉత్సహం మధ్య ‘హర్ ఘర్ తిరంగా యాత్ర’ కొనసాగింది. ఈ కార్యకమ్రంలో కూటమి పార్టీలకు చెందిన బీజేపీ, జనసేన, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *