సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తనెప్పుడయిన ఏపీ నుండి పోటీ చెయ్యవలసి వస్తే.. భీమవరం నుండి పోటీ చేస్తానని అక్కడ ప్రజలు ప్రత్యేక మైనవారు..కష్టపడతారు.. అతిథ్యంలో ముందుంటారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తారని గతంలో ఒకసారి ప్రకటించిన తెలంగాణ మం త్రి కేటీఆర్, తాజగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా యి. రాంపూర్ ఐటీ పార్క్ లో గత శుక్రవారం క్వాడ్రంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ.. ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా తెలుగు రాష్ట్రాలలో ఎక్క డికక్కడ పరిశ్రమలు పెట్టాలన్నారు. బెంగళూరులో 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఆంధ్రా, తెలంగాణ వాళ్లేనని ఆయన చెప్పారు. అటువంటి మంచి టాలెంట్ ఉన్న వాళ్లంతా తిరిగి సొంత ప్రాంతాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆంధ్రాలోని భీమవరం , నెల్లూరు ప్రాంతాల్లో భవిష్యత్‌లో గొప్ప ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. ఏపీలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని, అవసరమైతే ‘జగనన్న కు చెప్పి అక్క డ స్థలం ఇప్పి స్తానని క్వా డ్రంట్ సాఫ్ట్‌వేర్కంపెనీ యజమానులకు కేటీఆర్ సూచించారు. ఈ కామెం ట్స్ తో సభలో ఒక్క సారిగా ఆనం దం తో కేకలు వేశారు. కేటీఆర్ స్పందిస్తూ తప్పేంలేదన్నారు. కులం , మతం , ప్రాంతం పేర్లతో కొట్టుకు చావద్దన్నారు. దేశానికి మంచి జరగాలంటే ఎక్క డివారికి అక్క డే ఉపాధి దొరకాలన్నారు.
