సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు లో ఒక దశాబ్దం క్రితం భారీ సినిమాల విలన్ గా ప్రసిద్ధి చెంది ఇటీవల తదుపరి నవ్వులు పూయించే వేషాలు వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) గత మంగళవారం రాత్రి గుండెపోటు తో కన్నుమూశారు. ‘సై’ చిత్రంలో భిక్షు యాదవ్ పాత్రతో ఆజానుబాహుడు, బలమైన శరీరం,కర్కశ ముఖ కవళికలు తో అదరగొట్టి టాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన ఆయన.. ‘ఛత్రపతి’, ‘దేశముదురు’, ‘గజిని’, ‘స్టాలిన్’ వన్ నేనొక్కడినే.. వంటి అనేక హిట్ సినిమాల్లో ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అలరించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. 3 దశాబ్దాల క్రితం దూరదర్శన్ మహా భారత్ సీరియల్ లో అశ్వర్దమా పాత్రలో దేశవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించి తదుపరి అమిర్ ఖాన్ హీరోగా లగాన్, సర్ప రోష్ గజని సినిమాలతో బాలీవుడ్ ను ప్రదీప్ రావత్ షేక్ చేసాడు. తెలుగులో సై సినిమా తరువాత కాకినాడ కు చెందిన తెలుగు మహిళను పెళ్లి చేసుకొన్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
