సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతములో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది.. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. నేడు బుధవారం, రేపటి గురువారం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు వీచే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *