సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి పర్వదినాలలో భాగంగా రెండవరోజు నేడు, శనివారం సాంప్రదాయ పండుగ వినోదం పండగ ఆహ్లాదం జిల్లా వ్యాప్తంగా కనిపించింది. భీమవరంలో అయితే నేటి ఉదయం నుండి ఎక్కడెక్కనుంచో వచ్చిన వెలది కార్లు పిపి రోడ్డు ట్రాఫిక్ లో సందడి చేసాయి. యువత బైక్ లపై జోరుగా హుషారుగా జోష్ చేసారు. ముఖ్యంగా భీమవరం, పెద్దమిరం, వీరవాసరం, సిసిలీ, దొంగపిండి, వీరవాసరం , పాలకొల్లు, నిడమర్రు, మొగల్తూరు పరిసర ప్రాంతాలలో రెండోరోజు కోడిపందాలు భారీగా ప్రారంభమయ్యాయి. భీమవరంపరిసర లో అయితే నిన్న ఉదయం కోడి పందాలు ఆలస్యం కావడం తదుపరి మధ్యాహ్నం భారీ వర్షం కోడి పందాలకు అడ్డంకిగా మారడంతో దూరప్రాంతాల నుండి వచ్చినవారికి కొంత నిరాశ ఎదురయ్యింది. అయితే నేటి ఉదయం 9 గంటల నుండి సాంప్రదాయ పందాలు పేరుతొ ప్రారంభమయ్యాయి. అయితే పోలీసులు హెచ్చరికలు నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో నిర్వాహకులు గుండటాలు ,పేకాట, కోతాట ఇతర జూదాలను ఉదయం 11 గంటల నుండి పూర్తిగా నిలుపుదల చెయ్యడం గమనార్హం.. కొన్ని పందాల బరులు వద్ద ఘర్షణలు లేకుండా నిర్వాహకులు హైటెక్ గా నల్లటి దుస్తులు ధరించిన బౌన్సర్లు కు నియమించుకోవడం విశేషం, ఇక ఆయా ప్రాంతాలలో కోడిపకోడీ ,బిర్యానీ స్టాల్స్, ఐస్ క్రీమ్స్, జ్యూస్లు మందు విందు మస్త్.. పండుగ మజా..కాగా… నిన్న భీమవరం సమీపంలోని పాలకోడేరు లో వరుసగా 3 కోడిపందాలు ఓడిపోవడంతో వీర్రాజు(35) అనే వ్యక్తి పందాల బరి బయటకు రాగానే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడని వచ్చిన వార్త ఆ ప్రాంతంలో విషాదం నింపింది. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *