సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2024 మొదటి అంకంలో జరగనున్న ఏపీ శాసనసభ ఎన్నికలకు ఇప్పటికే పరోక్షంగా అన్ని పార్టీలు ప్రచారం మొదలు పెట్టేశాయి. అయితే రాష్ట్రంలో అందరి ద్రుష్టి భీమవరం నియోజకవర్గంపై కేంద్రీకృతమై ఉంది. భీమవరం లో ఏ రాజకీయ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది .. ఇది చరితాత్మక సత్యం.. అయితే ఇటీవల టీడీపీ జనసేన పొత్తు లో భాగంగా ఈ సీటు కేటాయింపులో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పులపర్తి అంజిబాబు పోటీ చేసారు.. కాదు.. నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తారు అని ప్రచారం జరుగుతున్నప్పటికీ .. గతంలో పవన్ మొదటి వారాహి యాత్ర నేపథ్యంలో మన సిగ్మా న్యూస్ లో ప్రకటించినట్లు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే పోటీ చేస్తారు అని తాజా పరిణామాల నేపథ్యంలో పక్కాగా విశ్లేషించవచ్చు.. గత 2019 ఎన్నికలలోపవన్ ఇక్కడి నుండే పోటీ చేసి భంగపడినప్పటికీ పోగొట్టుకొన్న చోటే వెతుకోవాలె.. అన్న సామెత పవన్ ఫాలో కానున్నారు. అందుకే ఇటీవల టీడీపీ జనసేన పార్టీల పొత్తు సమన్వయ కమిటీ లో సభ్యునిగా భీమవరం కు చెందిన కోటికల పూడి చినబాబు కు కీలక పదవి కట్టబెట్టారని విశ్లేషణ. మొదటి వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ భీమవరం నా నెల.. ఇక్కడ నుండే నా జనసేన గోదావరి జిల్లాలలో నియోజకవర్గాలలో విజయ పతాకం ఎగురవేస్తుంది అన్నారు. ఇక భీమవరం జనసేన లో 2గ్రూపు లు ఉన్నపటికీ పవన్ అభ్యర్థిగా పోటీ చేస్తే.. వారందరు ఒక్క తాటిపైకి కచ్చితంగా వస్తారు అని అంచనా.. జనసేనకు పశ్చిమ గోదావరి జిల్లాలో క్షేత్ర స్థాయి వరకు పార్టీ కార్యవర్గం ఏర్పాటు చెయ్యడం మరో ప్లస్ పాయింట్.. గతంలో తాను గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8వేల ఓట్ల తేడాతో ఓటమి చెందిన కూడా తరువాత కూడా జనసేన భీమవరం నియోజకవర్గంలోని పలు ఎంపీటీసీ లతో పాటు వీరవాసరం జడ్పీటిసి ని గెలుచుకొంది .ఈసారి టీడీపీ మిత్ర పక్షం గా వారికీ గతంలో పడిన 60వేల పైగా ఓట్లలో జెనసేనకు 40వేలు పడిన పవన్ గెలుపు ఖాయం అనే ధీమా ఉంది. ఈ సమీకరణాలు ఇలా ఉండగా.. పవన్ ఎక్కడ పోటీ చేసిన ఓడించాలని కృత నిశ్చయం తో ఉన్న వైసిపి అధిష్టానం నుండి మరోసారి భీమవరం బరిలో దిగేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఆయన భీమవరం ను జిల్లా కేంద్రం చేసిన ఘనతతో పాటు .. తాను 2 పర్యాయాలు నియోజక వర్గ పరిధిలో చేసిన వందల కోట్ల రూపాయల నిధులతో చేసిన అభివృద్ధి ఏ జెండా తో జనంలోకి ఇప్పటికే దూసుకొని పోయారు. తాను ఏ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేయించానో ? రోడ్డులుఎం వంతెనలు, పేదల ఇల్లు , స్థలాలు ఇతర సంక్షేమ ఫలాలు ను లెక్కలతో సహా క్షణాలలో చెప్పటంలో దిట్ట గ్రంధి శ్రీనివాస్..ఆయనకు పెట్టని కోటగా ఉన్న లోకల్ మాస్ పాలోయింగ్ తో పాటు మంత్రి పదవి వచ్చి ఉంటె మరో రేంజ్ లో ఉండేవారు. మరిప్పుడు భీమవరం నుండి మరోమారు పవన్ ఫై పోటీకి అవకాశం ఉన్న నేపథ్యంలో వైసిపి అధిష్టానం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి హోదాస్థాయిలో ప్రభుత్వ చీప్ విఫ్ పదవిని కట్టబెట్టి ఆయన స్థాయి ని మరింత బలోపేతం చేసింది. ఇక అంత అనుకున్నట్లే జరిగితే ప్రపంచంలో తెలుగు వారు అందరు ఆసక్తితో భీమవరం లో ఎన్నికలు పోరు చూసే అవకాశం ఎంతో దూరంలో లేదు.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *