సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇక చంద్రబాబు రాజకీయ జీవితం ఫై చీకట్లు కమ్ముకొంటున్నాయి. నేటి సోమవారం కోసం ఆయనతో పాటు ఎదురు చుసిన టీడీపీ క్యాడర్ కు తీవ్ర నిరాశ కలిగించే రీతిలో వరుసగా కోర్ట్ తీర్పులు వెలువడుతున్నాయి. అంగళ్లు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ వరుస అవినీతి కేసుల్లో.. చంద్రబాబు పెట్టుకొన్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను సైతం హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి తీర్పును వెలువరించారు. ఇక నేటి సోమవారం ఏసీబీ కోర్టు విషయానికి వస్తే.. లంచ్ తర్వాతే చంద్రబాబు బెయిల్, కస్టడీపై తీర్పు వెలువడనుంది. లంచ్ తర్వాత రెండు పీటీ వారెంట్లపై విచారణ జరగనుంది. సుప్రీం కోర్టులో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు కు సంబందించి చంద్రబాబు పిటిషన్ ఫై విచారణ ఉంది
