సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా లోని హమాస్ సంస్థ మధ్య బీకర యుద్ధం జరుగుతుంది. ఇజాయిల్ దేశం లోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. తమ భూభాగంలో సరిహద్దు కంచె బ్రద్దలు కొట్టి ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులను ఏరివేస్తున్నామని, ఇప్పటివరకు 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించినట్లు తాజాగా నేడు, మంగళవారం ప్రకటించింది. సరిహద్దులు కూడా పూర్తిగా తమ అధీనంలోకి వచ్చి నట్లు తెలిపింది. అలాగే హమాస్ సంస్థకు కేంద్రంగా ఉన్న గాజా నగరంపై ఇజ్రాయిల్ దాడులు ముమ్మరం చేస్తూ నగరాన్ని అష్టదిగ్బంధనం చేసినట్లు తెలుస్తుంది, అక్కడ వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి.
