సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు అరెస్ట్ తరువాత ఒకవైపు నారా లోకేష్ ఢిల్లీలో దాదాపు నెల రోజులు పాటు గడిపి ఒక్క కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోయిన సరే .. బాధ ను కడుపులో దాచుకొని చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదని మీడియా ముందు ప్రకటించడం తో టీడీపీ పార్టీ క్యాడర్ విస్తుబోయింది. అంతకు ముందే అచ్చేమ్ నాయుడు, బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్స్ బీజేపీ తీరుపట్ల అనుమానం, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా తాజాగా .. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యనారాయణ తాజగా నేడు, బుధవారం నరసాపురంలో కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రూర రాజకీయాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని, బీజేపీ, వైసీపీ కలిసి రాష్ట్రంలో ప్యూహం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ నియంత లా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడమని హెచ్చరించారు. చంద్రబాబు విడుదల అయ్యేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నర్సాపురంలో 31వ రోజు రిలే దీక్ష చేస్తున్న టీడీపీ శెట్టి బలిజ సామాజిక వర్గానికి పితాని సత్యనారాయణ సంఘీభావం తెలిపారు.
