సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: అన్ని చోట్ల సంక్రాంతి సంభరాలు 3రోజులు, 4రోజులు జరిగితే సంక్రాంతి పండుగకు మరో పేరుగా నిలచిన భీమవరం పట్టణంలో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి ఉత్సవాల సందడితో 30 రోజులు కొనసాగడం ఇక్కడ పెద్ద విశేషం. ఉత్సవాలు అంటే ఎదో ఆషామాషీగా కాదు.. భారీ సెటింగ్స్., డిజిటల్ గ్రాఫిక్ లైటింగ్స్, ఉత్సవ కమిటీ వారు ఈ సారి కూడా భారీగానే ఏర్పాటు చేసారు. ఇక్కడ ప్రతిరోజూ మన సాంప్రదాయ బద్దమైన పారాణిక నాటక ప్రదర్శనలు గత 58 ఏళ్లుగా అందమైన భారీ ప్రాంగణ సెట్స్ లో నిర్వహించడం హైలైట్స్ . ఎందరు కళాకారులకు ఇక్కడ ప్రదర్శనలు, సన్మానాలు ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇక మ్యూజికల్ నైట్స్ , సినిమా నటుల సన్మానాలు సందడి ఒకనాటి గ్రామీణ తిరునాళ్ళు భీమవరం నగర నడిబొడ్డున సజీవంగా కనిపిస్తాయి. సంక్రాంతి పండుగ రోజులలో బంధుమిత్రులతో ఉదయం శ్రీ అమ్మవారిని దర్శించుకునే వేలాది భక్తులు 3 రోజు నుండి ప్రతి సాయంత్రం ఆలయం నలుదిశలా భారీ లైటింగ్ అలంకరణలు, రోడ్లకు కు ఇరువైపులా తీర్ధం స్టాల్స్ , తినుబండారాలు తో అలంకరణలతో తిరునాళ్ళు లో పాల్గొనడం గొప్ప ఆధ్యాత్మిక ఆహ్లద అనుభూతిగా భావిస్తారు. ఇక్కడకు సమీపంలో లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మరో అదనపు వినోదపు బోనస్,, అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి శ్రీ అమ్మవారి ఉత్సవాలలో పాల్గొనడం తప్పనిసరి.. శ్రేయస్కరం..
