సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం చెయ్యడానికి ఒకదిశలో సిద్దమైనప్పటికీ తన డిమాండ్స్ కు అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానం నుండి సరైన సమాధానం రాకపోవడంతో విసిగిపోయి వచ్చే తెలంగాణ ఎన్నికలలో షర్మిల రాజకీయాలలో తాడోపేడో తేల్చుకోవడానికి స్వతంత్రంగా బరిలో దిగిపోతున్నారు. తాజా రిపోర్టుల ప్రకారం ఎన్నికలలో బిఆర్ ఎస్ కు కాంగ్రెస్ కు ఈసారి హోరాహోరీగా పోరు జరుగుతుందని సంకేతాలు వస్తున్నా నేపథ్యంలో .. తాజగా వై ఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP) నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారు.(మరో స్థానం నుండి కూడా..?) పార్టీ బీఫామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నేతలకు షర్మిల సూచించారు. అయితే పెద్ద షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. తల్లి వై ఎస్ విజయమ్మ ప్రతిష్టాకర సికింద్రాబాద్ నుండి పోటీకి దిగుతున్నట్లు వస్తున్నా వార్తలతో తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు మొదలయ్యాయి. షర్మిల పార్టీ ఎక్కడ గెలవకపోయిన కనీసం 5 శాతం ఓట్లు సాధించిన సరే.. కాంగ్రెస్ విజయావకాశాలు పూర్తిగా దూరం అయినట్లే నని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *