సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం రేపటి నుండి ప్రారంభమయ్యే దసరా వేడుకలకు సిద్ధం అయ్యింది. అందమైన లైటింగ్, పుష్ప అలంకరణలు, ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వచ్చే భక్తుల కోసం భారీ పందిళ్లు ఏర్పాటు చేసారు. నేడు, శనివారం ఈ రోజు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో అమావాస్య సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య చండీహోమం నిర్వహించారు. ఈ హోమం వద్ద . 80 మంది దంపతులు పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *