సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన యువకుని మృతి తాజగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళ్ళితే.. భీమవరానికి చెందిన జక్కం కుమార్ వెంకటసాయి సుహాస్ (28) కొత్తనవరసపురం లో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతడు రెండు రోజులుగా సెలవులో ఉన్నాడు. తండ్రితో చెప్పి శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుండి అతని ఫోన్ పనిచేయలేదు. అయితే గత శనివారం పేరుపాలెం బీచ్ వద్ద వేళం కిణి మాత ఆలయ సమీపంలోని కొబ్బరితోటలో అతని మృతదేహం కనపడింది. స్థానిక సీఐ శ్రీనివాసయాదవ్ ఆ మృతదేహాన్ని గుర్తించి భీమవరంలో యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యా లేక మరేదైనా కారణమా ? అని అనుమానాస్వాద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
