సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు సంస్కృతీ ఎంత గొప్పది.. ప్రపంచ దేశాలలో మనుషులకు మాత్రమే పండుగలు ఉంటాయి. కానీ మన సంక్రాంతిలో 4రోజుల పండుగ లు ఉంటాయి. మొదటి 2 రోజులు మనకు, మన బంధు మిత్రులకు అయితే .. మూడో రోజు కనుమ పండుగ. మన ప్రాంత రైతు లు పండించే వరి వ్యవసాయంలో సాయం చేసిన పశువులను, పండిన సరుకును బండ్లలో తీసుకొనివెళ్లే ఎద్దుల కోసం (ఎద్దును సాక్షాతూ శివుని వాహనం బసవేశ్వరుడుగా భావిస్తారు), మనకు పాలిచ్చి పోషించే ఆవుల కోసం, గేదెల కోసం వాటి శ్రమను గుర్తిస్తూ వాటిని అలంకరించి వాటిని మన తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ కృతజ్ఞతలు తెలపడానికి కనుమ పండుగ రోజు రైతులు పశువులను అలంకరించి, వాటి కొమ్ములకు రంగులు వేసి పసుపు, కుంకుమ తో పూజించే సంప్రదాయం మనది. ప్రతి పల్లెలోనూ పశుసంపద వృద్ధిచెందాలని, ప్రతి రైతు ఇంట పాడి పంటలకు ఏ లోటూ రాకూడదని పశువుల అస్సిసులు కోరుకొంటారు. దీనిలో భాగంగా భీమవరం లో దేవాలయాల వద్ద, గోసంరక్షణ శాలలలో, ఎడ్లబండి సంఘాల వద్ద, పొలాల వద్ద పలుచోటల గోపూజలు, ఎద్దుల పూజలు నిర్వహించారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో 4వ రోజు సంక్రాంతి ముక్కనుమ పండుగ కూడా చేస్తారు. రైతులు, శ్రామికులు తమకు వాడే పనిముట్లకు, ట్రాక్టర్లు కు పూజలు చేసి సామూహిక విందు భోజనాలు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *