సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, బుధవారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక కోస్టల్ బ్యాంకు వద్ద నుండి యనమదురు కాలువలోకి వెళ్లే మురుగు నీరు డ్రైనేజీకి బాగా పాడైపోవడం వలన నూతన నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. తదుపరి స్థానిక 21వ వార్డు లో త్యాగరాజు భవనం వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శ్యామల తో పాటు వైసీపీ పట్టణ అడ్జక్షుడు తోట బోగయ్య, ఏ ఏస్ రాజు తదితర నేతలు , వైసీపీ వార్డు నాయకులు కార్యకర్తలు. అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
