సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి దసరా వేడుకలు ముగింపుగా మహా అన్నసమారాధన నిర్వహిస్తున్నారు, ఈ నెల 28 వ తేదీ శనివారం ఉదయం 5 గంటల 15 నిమిషాలకు 40 రోజుల పాటు మండల దీక్ష పాటించే భక్తులకు మాల ధారణ ప్రధాన అర్చకుల నేతృత్వంలో శ్రీ అమ్మవారి సమక్షంలో నిర్వహించబడుతుంది అని , అర్ధ మండల దీక్ష 20 రోజులు చేసే భక్తులకు నవంబర్ 17న శుక్రవారం ఉదయం 5గంటలకు మాల ధారణ చేస్తామని, నవంబర్ 27న సోమవారం ఉదయం 5 గంటలకు పాద మండల దీక్ష ఇస్తామని తదుపరి డిసెంబర్ 7న దీక్ష విరమణ పూర్ణాహుతి యాగం జరుగుతుందని ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాది ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *