సిగ్మాతెలుగు డాట్ ఇన్,న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కు తాజగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా చంద్రబాబు, నేటి మంగళవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కరోనా టెస్టులో స్వల్ప లక్షణాలతో పాజిటివ్ వచ్చినట్లు ట్వీట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయిన వారు టెస్ట్ చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొద్దీ రోజుల క్రితమే ఆయన తనయుడు నారా లోకేష్ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం ఇక్కడ గమనార్హం.. చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్, ఈమేరకు నేడు, మంగళవారం ట్వీట్ చేశారు.
