సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఒక మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. గోదావరి జిల్లాలలో చల్లదనంతో గత వారం రోజులుగా చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల రాకతో శనివారం ఉదయం నుంచి తమిళనాడు లో అయితే దక్షిణాది జిల్లాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు. అక్కడ పాఠశాలలు కూడా మూసివేశారు. రానున్న మూడు రోజులపాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఏడు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ చెబుతోంది. ఈ వర్షపాతం ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, దక్షిణ కర్ణాటకలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది.
