సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి సభలు పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక వీరమ్మ పార్క్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి భీమవరం టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నేతలు పుష్ప మాలలు వేసి ఆ మహానేతకు ఘన నివాళ్లు అర్పించారు. తెలుగు జాతి పౌరుషం , తెలుగు బాషా గొప్పతనం దేశానికీ చాటి చెప్పిన మహా మనిషి ఎన్టీఆర్ అని మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీత రామలక్ష్మి, మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మెన్, మెంటే పార్ధ సారధి,మాజీ మునిసిపల్ చైర్మెన్, మెరుగని నారాయణమ్మ,వెండ్ర శ్రీనివాస్,మామిడి శెట్టి ప్రసాద్, కోళ్ల నాగేశ్వర రావు, ఎద్దు ఏసుపాదం తదితర నేతలు కొనియాడి ఆయన కు ఘన నివాళ్లు అర్పించారు.
