సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భారత్ లో కరోనా కేసులు ఇటీవల ప్రతి రోజు 2 లక్షలు దాటి దాదాపు మూడు లక్షలకు చేరువలో నమోదు అవుతున్న నేపథ్యంలో .. తాజా కేసులను పరిశోధించిన భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) భారీ ఊరట నిచ్చే అంశాన్ని ప్రకటించింది. భారత్ లో మార్చి 11 నాటికి కరోనా ఎండమిక్‌ స్టేజ్‌కు చేరుకుంటుందని ఎపిడెమియోలాజికల్ విభాగానికి చెందిన సైంటిస్ట్‌ డి సమీరన్ పాండా వెల్లడించారు. డెల్టా కరోనా వైరస్ ను ఒమిక్రాన్‌ అధిగమిస్తే ఇక కరోనా అంతమైనట్టేనని భావించవచ్చన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త వేరియంట్లేవీ ఉద్భవించకపోతే మార్చి 11 నాటికి కోవిడ్ స్థానికంగా సాధారణ ఫ్లూ జ్వరంగా మారుతుందని ఆయన చెప్పారు. తమ గణాంకాల ప్రకారం డిసెంబరు 11 నుండి ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు కొనసాగనుందన్నారు. దీని ప్రకారం మార్చి 11 తరువాత నుంచి కరోనా నుంచి ఉపశమనం లబించవచ్చని పాండా తెలిపారు. అయితే ఢిల్లీ, ముంబై కోవిడ్ కేసుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయా, ఇంతటితో ఉదృతి ముగిసిందా ?అని చెప్పేందుకు మరో రెండు వారాలు వేచి చూసి నిర్ణయించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *