సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ టీడీపీ అడ్జక్షుడు అచ్చెమునాయుడు , ఇతర కీలక నేతలతో కలసి నారా లోకేష్ నేడు, మంగళవారం రాజ్భవన్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. గవర్నర్ తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్షలపై అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కక్ష పూరితంగా కేసులు పెట్టి వేధిస్తోందని, తమ అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై సుమారు 60వేలు అక్రమ కేసులు పెట్టారని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని, గవర్నర్ కలుగజేసుకొని రాజ్యాంగాన్ని కాపాడాలని విన్నతి ఇచ్చినట్లు తెలిపారు.
