సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ఎన్నికలలో జనసేన బీజేపీ పొత్తు తో కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ మరో 2స్థానాలులో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ఆశించినప్పటికీ బీజేపీ సున్నితంగా త్రోసిపుచ్చి శేరు లింగంపల్లి తో సహా బీజేపీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక దారుణమైన విషయం ఏమిటంటే.. హైదరాబాద్ సిటీలో కేవలం గోదావరి వాసులు ఎక్కువ మంది నివసించే కూకట్ పల్లి జనసేన కు కేటాయించిన కూడా అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి , ప్రముఖ వ్యాపారవేత్త ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు తాజాగా జనసేన పార్టీలో చేర్చుకొని టికెట్ కట్టబెట్టడం తో అక్కడ జనసేన పార్టీ కోసం గత 10 ఏళ్లుగా ఎంతో శ్రమించిన శంకర్ గౌడ్ ను తీవ్ర నిరాశపరిచారు. తప్పని పరిస్థితులలో శంకర్ గౌడ్ కు పెద్దగా పట్టులేని తాండూరు సిటు కేటాయించారు. అలాగే కొత్త గూడెం స్తానం నుండి కొత్తగా పార్టీలో చేరిన లక్కినేని సురేంద్ర రావు కు టికెట్ కేటాయించడం తో జనసేన శ్రేణులు నివ్వెరపోయాయి. అంటే బీజేపీ పార్టీ పొత్తులో ఇచ్చిన 8స్థానాలలో నిజానికి 6 స్థానాలు జనసేన పరిమితమయ్యింది. దీని ప్రభావం అనుకొంటా.. గత రాత్రి ప్రధాని మోడీ బహిరంగ సభలో జనసేన శ్రేణులు పెద్దగా కనపడలేదు. అంతా బీజేపీ మయమే.. పవన్ మాట్లాడుతున్నపుడు, మోడీని ప్రపంచంలోనే సమర్ధుడైన నాయకుడు అని ప్రశంసిస్తున్నప్పుడు మోడీ ద్రుష్టి ఆయనపై పడకుండా కిషన్ రెడ్డి మోడీతో వేదికపైనే బాతాఖానీ మొదలు పెట్టారు. 35 సీట్లు పోటీ చేస్తామని ప్రకటించి కేవలం 6 స్థానాలకు పరిమితమైన జనసేన పరిస్థితి ఏపీలో కూడా పవన్ ఇదే మెతక వైఖరి టీడీపీతో వ్యవహరిస్తే మన పరిస్థితి ఏమిటి? అసలు ఎన్ని సీట్లు కేటాయిస్తారో కానీ..మరల పొత్తులో ఇచ్చిన సీట్లకు కూడా టీడీపీ అభ్యర్థులే కర్చీఫ్ లు వేసేస్తారేమో? అని జనసేన నేతలు అప్రమత్తం అవుతున్నారు. ఈసారి ఏపీలో జనసేన నేతలు అయితే అంత తేలికగా తీసుకొనే వ్యవహారం కాదు మరి.. పవన్ కళ్యాణ్ ఆలోచించాలి.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్..
