సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండుగల వేళా ప్రేక్షకులకు వినోదాలు పంచడానికి 3 సినిమాలు ఒకేసారి బరిలో దిగాయి. వాటిలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ అగ్ర స్థాయి విజయం అందుకొంది. అయితే అటు బాలయ్య కానీ ఇటు దర్శకుడు అనిల్ రావిపూడి గత సినిమాల స్థాయి బంపర్ హిట్ కాదు కానీ బాలయ్య కెరీర్ లో ఒక విభిన్న కదా బలం తో ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చిన చిత్రంగా గుర్తుండిపోతుంది. ఇక తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజు ‘ లియో ‘ కూడా మంచి పోటీ ఇచ్చింది. ఎటువచ్చి రవితేజ టైగర్ నాగేశ్వర రావు నిరాశపరచింది. ఇక ఈ సినిమాలకు పశ్చిమ గోదావరి జిల్లా సినీ రాజధాని భీమవరం పట్టణం మొత్తంపై వచ్చిన కలెక్షన్స్ పరిశీలిస్తే.. భగవంత్ కేసరి 20 రోజులకు 47 లక్షలు పైగా వసూలు చేసి అరకోటికి దగ్గరగా ఉంది. ఇప్పటికి కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఇక లియో’ 20 రోజులకు మంచి ఓపెనింగ్స్ తో 32 లక్షలు పైగా వసూళ్లు చెయ్యగా ప్రస్తుతం బాగా నెమ్మదించింది. ఇక టైగర్ నాగేశ్వర రావు 19 రోజులకు సుమారు 25 లక్షల కలెక్షన్ వసూలు చేసింది. ఇటీవల విడులయిన పొలిమేర 2 అనే చిన్న చిత్రం 5రోజులకు 1లక్ష 5వేలు పైగా వసూళ్లు చెయ్యడం గమనార్హం.
