సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం సాయంత్రం పాలకొల్లు లో జరిగిన వైఎస్సార్ సీపీ నేతల సామాజిక సాధికార బస్సు యాత్ర సంద్భంగా జరిగిన బహిరంగ సభలో శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు తో పాటు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు , మంత్రులు, పాల్గొన్నారు. వైసిపి నేత శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించారు. అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు బస్సు యాత్ర సాగింది. గాంధీ బొమ్మల సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రులు కొట్టు సత్య నారాయణ, విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎం పీ, నందిగాం సురేష్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, ఇజ్రాయెల్ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ,.. గతం లో అబద్ధం అధికారంలో ఉంది.. ఆ అబద్ధమే చంద్రబాబు అంటూ విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చి న హామీలను 90 శాతం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. 139 బీసీ కులాలను గుర్తించి వారి సామాజిక స్థితి పెరగడానికి అండగా నిలిచారు. బీసీ వర్గాలను అణచివేసిన వ్య క్తి చంద్రబాబు, 2లక్షల పైగా వాలంటీర్లు ను ఏర్పాటు చెయ్యడమే కాకుండా ఏకంగా 1లక్ష 60 వేల ప్రభుత్వ ఉద్యో గాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అన్నారు. . చంద్రబాబు హయాంలో ఎస్సీ, మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి లేదు. ‘‘విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన.. వంటి పథకాలతో అందని ద్రాక్షగా ఉన్న చదువును పేదలకు చేరువచేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా జబ్బు న్న వారిని జల్లెడ పట్టి వారికి అండగా నిలిచారు. సామాజిక సాధికారత జగనన్న కే సాధ్యమైందని పాలకొల్లు సభ ద్వారా తెలుపబోతున్నాం. రెండు లక్షల 38 వేల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *