సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం భీమవరం మండలం, గునుపూడి లో వేంచేసి యున్న పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు గత 154 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల కోసం హుండీలు తెరచి నేడు, బుధవారం ఉదయం లెక్కించగా రూ.7,88,128/-లు నగదు వచ్చినట్లు దేవాలయ కార్యనిర్వాహణ అధికారి రాధాకృష్ణ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో స్థానిక భక్తులు, ధర్మకర్తల మండలిసభ్యులు అయిన కూర్మదాసు సత్య శ్రీనివాస్, నాచు శ్రీవల్లి, నల్లం రఘుబాబు, చల్లబోయిన సూర్యప్రకాష్, లక్కు త్రిమూర్తులు, సోమాదుల లీలా ఈశ్వరి, తాణల రామకృష్ణ, కొయ తాతాజీ మరియు వి.వెంకటేశ్వర రావు, తనిఖీదారు, దేవదాయ ధర్మదాయ శాఖ వారి సమక్షములో నిర్వహించినట్లు తెలిపారు
