సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 3 రోజులలో దీపావళి పర్వదినం.. దీపావళి అనగానే ఆబాల గోపాలానికి గుర్తుకువచ్చేది బాణాసంచా కాల్పులు.. దీపపు వెలుగుల సందడి.. ఈ నేపథ్యంలో ఎప్పటి లానే భీమవరం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో బాణసంచా షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద స్థాయిలో 12వరకు షాపులు ఏర్పాటు చెయ్యగా మరో 30వరకు చిన్న స్థాయిలో షాపులు ప్రక్కన ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈసారి షాపులు అన్ని ఒక క్రమ పద్దతిలో ‘యూ’ ఆకారంలో ఏర్పాటు చేసి మధ్య లో గతంలో ఎప్పుడు లేనంతగా ఖాళీ గ్రౌండ్ వదిలెయ్యడంతో అటు వాహనాల పార్కింగ్కు అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ సిబ్బంది అటువంటి ఇబ్బంది లేకుండా పనిచేయడానికి చాల అనుకూలంగా ఉంది, ఇక ఎప్పటి లానే బాణాసంచా ధరలు గత ఏడాది కన్నా పెరిగాయి, ధరలు విని పటాసులు కాల్చకుండానే కొనుకోలుదారులకు శబ్దాలు వినపడుతున్నాయి, అయినప్పటికీ తమ బడ్జెట్ ప్రకారం ఉన్నంతలో ఐటమ్స్ తగ్గించుకొని సామాన్యులు కొనుగోలు చెయ్యడం కనిపిస్తుంది, ఎల్లుండి శనివారం మాత్రం కొనుగోలుదారుల కోలాహలం బాగా పెరిగే అవకాశం ఉంది
