సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం ఏపీలో వాతావరణం గత 2 రోజులుగా పొడిపొడి ఉండటంతో దీపావళి సీజన్ లో వ్యాపారస్తులు ఊపిరి తీసుకొన్నారు. అయితే ఈనెల 14న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. ఈ అల్పపీడనం 16వతేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. మొత్తానికి దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *