సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా వచ్చి 2 దశాబ్దాలు దాటిన ఆ సినిమా ను జనం మరచిపోలేదు. అయితే ఇటీవల దానికి స్వీక్వల్ గా అష్టకష్టాలు పడి పూర్తీ చేస్తున్న ఇండియన్ 2 అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ .2024 సమ్మ ర్ విడుదల టార్గెట్ గా పెట్టారు. వచ్చే డిసెంబర్ నాటికి ఇండియన్ 2 షూటింగ్ పూర్తి అయిపోతుందట. అయితే అది కాదు అసలు విషయం … దాని నిడివి ఎక్కువ కావడంతో ప్రస్తుతం దాని సీక్వల్ ఇండియన్ 3 షూటింగ్ కూడా అదే సమయంలో పూర్తీ చేసేస్తున్నారట..? దాంతో కొన్ని అదనపు సన్నివేశాలతో స్క్రిప్ట్ లో మార్పులు చేసారు. దాంతో అనుకున్న దానికన్నా మరోనెల రోజులు పైగా వర్క్ చేస్తే చాలు ఇండియన్ 2, ఇండియన్ 3 రెండూ రెడీ అయిపోతాయని డిసైడ్ అయ్యారు. అంటే కమల్ హాసన్ 2 సినిమాల రెమునేషన్స్ తో ఒక్కదెబ్బకు 2 పిట్టలు.. కాదు కాదు.. శంకర్ అయితే ఇదే సమయంలో రాంచరణ్ హీరోగా గేమ్ చేంజెర్ షూటింగ్ కూడా చేస్తున్నాడు.. అంటే శంకర్ ఒక్క దెబ్బకు 3 బ్లాక్ బస్టర్ సినిమాలు మీద గురిపెడుతున్నాడు… అది అసలు సంచలనం..
