సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి సంబరాలవేళలో తిరుమల లో భక్తుల రద్దీ బాగా తగ్గింది. నేడు (సోమవారం) భక్తుల రద్దీ చాలా స్వల్పంగా మాత్రమే ఉంది. దీంతో శ్రీవారి దర్శనానికి ఎక్కడా వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడంతో భక్తులు నేరుగా సర్వదర్శనం లో ఒకటికి 2సార్ల పైగా చేసుకొంటున్నారు.. గత దీపావళి రోజు ఆదివారం శ్రీవారిని 74,807 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. కాగా భక్తులకు బోనస్ గా వీక్షించడానికి .. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నాలుగవ రోజుకు చేరుకున్నాయి. నేటి సోమవారం ఉదయం కల్పవృక్ష, సాయంత్రం హనుమంత వాహన సేవలు అమ్మవారికి అందిస్తారు.
